తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. గత ప్రభుత్వంలో నాకు చాలా అన్యాయం జరిగిందని, నా కుటుంబాన్ని దొంగ వాళ్లుగా చిత్రీకరించి జైళ్లకు పంపారని అధికారులను తిడుతూ.. లెక్కలు తేలుస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ .. . తప్పుచేసిన అధికారులను వదిలేసి.. తమను దొంగలు మాదిరిగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. నా బస్సులు సీజ్ చేయడంపై పది రోజుల్లో ఎంక్వైరీ జరగాలి.. నేను ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబుని ఏం అనను. చంద్రబాబుకు నేనేం వ్యతిరేకం కాదు.. కానీ నా బస్సుల సీజ్ విషయంలో ఎవరినీ వదలను.. బ్రేక్ ఇన్‌స్పెక్టర్లకు చెబుతున్నా.. నేను ఎంత దూరమైనా వెళ్తా... బ్రేక్ ఇన్‌స్పెక్టర్లు నా కాళ్లు పట్టుకుని నా బస్సులు రిపేర్లు చేయాల్సిందే!’’ అని మాస్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
నేను అడిగితే కేసు నుంచి బయట పడేసేందుకు చంద్రబాబు చేస్తారు... కానీ ఇది నా వ్యక్తిగత అంశంగానే చూస్తాను.. దీనికి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సీతారామాంజనేయులు, అప్పటి మంత్రి పేర్నినాని కారణం అంటూ చెప్పుకొచ్చారాయన. జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ చేయాలని.. ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారాయన. తనకు జరిగిన అన్యాయంపై ట్రాన్స్ పోర్ట్ అధికారుల ఇంటి ఎదుట ధర్నా చేస్తానని.. ఏపీని చెడకొట్టింది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
తాడిపత్రి అల్లర్లలో అన్యాయంగా మా వారిపై రౌడీషీట్లు ఓపెన్ చేశారని మండిపడ్డారు ప్రభాకర్ రెడ్డి. రవాణా శాఖ అధికారులు అంతా లంచగొండులే అని.. నా బస్సులన్నింటినీ ట్రాన్స్ పోర్ట్ అధికారులు రిపేరు చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారాయన. నా పరువు తీసి బయట తిరగకుండా చేశారని.. నన్ను జైలుకు పంపించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. నాకు తిండి కూడా పెట్టలేదని.. వీళ్లంతా ఇప్పుడు ఏం చేస్తారు..? ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఐఏఎస్, ఐపీఎస్ లకు సిగ్గులేదా అంటూ వార్నింగ్ ఇచ్చిన జేసీ
— Anitha Reddy (@Anithareddyatp) June 19, 2024
అనంతపురం ఎస్పీకి కనీసం కాన్సిట్యూషన్ లో ఎబిసిడీలు కూడా తెలియవు... pic.twitter.com/qOs2Ux7tVD